KRMB కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చ

KRMB కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చ

KRMB త్రిసభ్య కమిటీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జూలై 31 వరకు కల్వకుర్తికి 300 క్యూసెక్కులు, HYD తాగునీటి అవసరాలకు 750, ఖమ్మం తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరింది. అలాగే, నెలాఖరు వరకు తాగునీటి కోసం 10.26 టీఎంసీలు కావాలంది. సాగర్‌లో 510 అడుగుల దిగువకు పంపింగ్ సరికాదని తెలంగాణ ఈఎన్‌సీ పేర్కొంది.