'పత్తి కొనుగోలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తాం'
MNCL: చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లులో CCI ద్వారా పత్తి కొనుగోలు చేపట్టడం లేదని మార్కెట్ కమిటీ కార్యదర్శి ఓదెలు ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటి వరకు రైతులు కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని, పత్తి కొనుగోలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.