మాజీ సింగిల్ విండో ఛైర్మన్ లక్ష్మీనారాయణ మృతి

మాజీ సింగిల్ విండో ఛైర్మన్ లక్ష్మీనారాయణ మృతి

వరంగల్: జిల్లా గీసుగొండ మండల కేంద్రానికి చెందిన మాజీ సింగిల్ విండో ఛైర్మన్ పొగాకు లక్ష్మీనారాయణ 65 శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ఉద్యమంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారు. రైతు శ్రేయోభిలాషిగా గుర్తింపు పొందిన ఆయన మృతికి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి సంతాపం ప్రకటించారు.