క్షయ నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్
JGL: క్షయవ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మెడికల్ కాలేజీ నుంచి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. జిల్లాలో 75 హైరిస్క్ గ్రామాల్లో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు, మొబైల్ ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.