తండా వాసులకు చేయూత అందించిన మాజీ ఎమ్మెల్యే
NGKL: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి నక్కల గండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో మునిగిపోయిన మర్లపాడు తండా వాసులకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేయూతను అందించారు. దాదాపు 200 కుటుంబాలకు ఆదివారం నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. విపత్తు సమయంలో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.