పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

AKP: పాయకరావుపేట మండలం మంగవరం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించినట్లు సీఐ అప్పన్న తెలిపారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి రూ.5,940 నగదు, మూడు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.