వేంసూరులో ఉచిత వైద్య శిబిరం

వేంసూరులో ఉచిత వైద్య శిబిరం

KMM: వేంసూరు మండలంలోని లింగపాలెం, రామన్నపాలెం గ్రామాలలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. వైద్యాధికారి ఇందుప్రియాంక, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జె. అంజలిల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాలకు 60 మంది రోగులు హాజరయ్యారు. శిబిరంలో వారికి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.