ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

KMM: చింతకాని మండలం నాగలిగొండలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.