'పుష్పతో పోల్చొద్దు'.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

'పుష్పతో పోల్చొద్దు'.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తన తాజా చిత్రం 'విలాయత్‌ బుద్ధ'లో తాను పోషించిన పాత్రపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించాడు. ఈ పాత్రను అల్లు అర్జున్ 'పుష్ప'తో పోల్చడాన్ని తప్పుబట్టాడు. 'విలాయత్‌ బుద్ధ సినిమాకు, పుష్ప చిత్రానికి మధ్య ఎలాంటి సృజనాత్మక సంబంధం(Creative Link) లేదు. దయచేసి ఆ పాత్రను పుష్పతో పోల్చొద్దు' అని పృథ్వీరాజ్ స్పష్టం చేశాడు.