కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య.!
BHNG: కుటుంబ కలహాలతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్య(59) అనే రైతు వరి పొలం ఎండిపోవడంతో జనరేటర్ కొందమంటే భార్య, కొడుకు వద్దనడంతో కోపంతో గడ్డి మందు తాగాడు. దీంతో అతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందతూ ఆదివారం మరణించాడు.