రహదారికి మరమ్మతులు చేయండి సారూ..!

రహదారికి మరమ్మతులు చేయండి సారూ..!

కృష్ణా: పెనమలూరులోని యనమలకుదురు-ముద్దూరు సుమారు 15 కి.మీ రహదారి ప్రమాదకర గుంతలతో అధ్వానంగా మారింది. రహదారి ఇలా మారడానికి అధిక లోడుతో తరలిస్తున్న ఇసుక టిప్పర్లే దీనికి ప్రధాన కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.