VIDEO: రంగనాయక స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

MBNR: జడ్చర్ల మండలంలోని శ్రీశ్రీ రంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పవిత్ర శ్రావణమాసం, సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి వాహనాల రాకపోకలు పెరగడంతో మర్గమంతా రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా క్యూ లైన్‌లో నిలబడ్డారు.