ఏపీఐడీసీ డైరెక్టర్‌గా సందీప్ నియామకం

ఏపీఐడీసీ డైరెక్టర్‌గా సందీప్ నియామకం

కర్నూలు నగరానికి చెందిన బిజినేపల్లి సందీప్‌ను ఏపీఐడీసీ డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భీమిశెట్టి మనోజ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సందీప్‌కు అవకాశం లభించింది. తన నియామకానికి సీఎం చంద్రబాబు, మంత్రి టీజీ భరత్‌కు సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.