'ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి'

KRNL: ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి హామీ పథకం పీడీ వెంకటరమణయ్య సూచించారు. మంగళవారం ఆస్పరి మండలం అట్లేకల్లు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీల మస్టర్లను పరిశీలించారు. వేసవి కాలం కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. ఉదయం 6గంటలకే పనికి వచ్చి 10 గంటలకు పనులు పూర్తి చేసి వెళ్లాలన్నారు.