రేపటి నుంచి లొంక ఆంజనేయస్వామి జాతర

రేపటి నుంచి లొంక ఆంజనేయస్వామి జాతర

VKB: పరిగి మండలం కాడ్లాపూర్‌లోని లొంక ఆంజనేయస్వామి జాతర డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2న గణపతి పూజ, కలశస్థాపన, 3న సత్సంగ ప్రవచనం, శకటోత్సవం, 4న తెల్లవారుజామున రథోత్సవం, అంబాభవాని బోనాలు నిర్వహిస్తారు. మూడు రోజులు భక్తులకు అన్నదానం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.