అకాడమీని ప్రారంభించిన మంత్రి

మేడ్చల్: కాప్రాలోని మాణిక్ సాయి ఎన్ క్లెవ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ'ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.