పొన్నూరులో 132 కేజీల నిషేధిత ప్లాస్టిక్ కవర్లు సీజ్
GNTR: పొన్నూరు పట్టణంలో మంగళవారం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పట్టణంలోని 21వ వార్డులోని దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రెండు షాపుల్లో నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు, నిల్వలు గుర్తించి, 132 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేశారు. ఒక దుకాణ యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు.ఈ దాడుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.