'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

BPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. బుధవారం రేపల్లె పట్టణంలో వ్యర్థాలను పడవేసే చోట శుభ్రం చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రేపల్లె మున్సిపల్ పరిధిలో చెత్త ఎక్కడైతే వేస్తూ ఉంటారో ఆ ప్రదేశాలను శుభ్రం చేసి మొక్కలు నాటటం వల్ల ఆ ప్రాంతంలో వ్యర్థ పదార్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నారు.