ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కేసులు
MNCL: జైపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవినీతికి పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శశిధర్ రాజు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ తెలిపారు. ఈ కేసులో రూ. కోటి 39 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కేసులు తప్పవన్నారు.