VIDEO: 'యాదవ మహాసభ జిల్లా కమిటీని ఎన్నుకోవాలి'

KNR: అఖిల భారత యాదవ మహాసభ తిమ్మాపూర్ మండల కమిటీ సమావేశం రామకృష్ణ కాలనీలో ఆదివారం జరిగింది. యాదవ మహాసభ జిల్లా కమిటీ సమయం ఇటీవల ముగిసిందని, వెంటనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని కోర్ కమిటీని కోరినట్లు తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కొత్త కమిటీని ఎన్నుకొని అభివృద్ధి విషయాన్ని చర్చించాలన్నారు.