ప్రజలతో కలిసి టీ తాగిన మంత్రి

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ కావలిలో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలతో ముచ్చటించారు. వారితో కలిసి టీ తాగారు. స్థానికులు పలకరించి తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఉదయాన్నే ప్రజలతో మమేకమై, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం మంచి అనుభూతిని కలిగించిందని మంత్రి తెలిపారు.