అధికారులతో నిర్మల్ కలెక్టర్ సమీక్ష
NRML: వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో చేపట్టిన పనులపై ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.