యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి
KDP: యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.