ఇవాళ్టి నుంచి జోగి సోదరులకు 4 రోజుల కస్టడీ

ఇవాళ్టి నుంచి జోగి సోదరులకు 4 రోజుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును నాలుగు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ్టి నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించవచ్చని తెలిపింది. అనంతరం విజయవాడలోని జిల్లా కారాగారంలో అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది.