ఆర్టీసీ బస్సుకి తృటిలో తప్పిన ప్రమాదం

ఆర్టీసీ బస్సుకి తృటిలో తప్పిన ప్రమాదం

NLR: సంగం హైవేపై ఆర్టీసీ బస్సుకి తృటిలో మంగళవారం రాత్రి ప్రమాదం తప్పింది. వైర్లు షార్టెజ్ అవడంతో బస్సు కింద భాగంలో మంటలు చెలరేగాయి. హైవే వద్ద అటుగా వెళ్తూ గమనించి వెంటనే బస్సు డ్రైవర్‌కి సంగం కానిస్టేబుల్ నాగార్జున సమాచారాన్ని అందజేశారు. వెంటనే బస్సును నిలిపి ప్రయాణికులను క్రిందకు దించివేశారు. బస్సు రిపేర్ కాకపోవడంతో ప్రయాణికులను వేరొక బస్సులో పంపించారు.