హైస్కూల్లో ఆధార్ కేంద్రం ఏర్పాటు

హైస్కూల్లో ఆధార్ కేంద్రం ఏర్పాటు

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జెడ్పీ హైస్కూల్‌లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైస్కూల్లో విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎం ప్రతాప్ కుమార్ తెలిపారు. ఆధార్ కార్డులు అప్డేట్‌తో పాటు మార్పులు చేర్పులు, తప్పులు పడిన పేర్లను సరిదిద్దడం జరుగుతుందన్నారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.