వేమవరంలో దోమల నివారణకు ఫాగింగ్
ప్రకాశం: మర్రిపూడి మండలం వేమవరంలో ఆదివారం రాత్రి దోమలు బెడద నివారించేందుకు ఫాగింగ్ చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు ఫాగింగ్ చేసినట్టు తెలిపారు. గ్రామంలో దోమలు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.