'సరైన విధానంలో తయారు చేయకపోవడం వల్లే ప్రమాదం'
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో మందు గుండు సామగ్రి తయారు చేసే సమయంలో సరియైన విధానం పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు హోం మంత్రి అనిత తెలిపారు. ఆదివారం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఆమె పంపిణీ చేశారు. తయారీ కేంద్రంలో సామర్థ్యానికి మించి మెటీరియల్ ఉన్న కారణంగా అధికారులను సస్పెండ్ చేశామన్నారు.