'ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ'

'ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ'

BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని మండల అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భరత్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.