ముగిసిన పరీక్ష విద్యార్థుల్లో చిరునవ్వులు
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల విద్యాలయంలో మంగళవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఐదవ రోజైన నేడు నిర్వహించిన బయాలజీ పార్ట్-2 పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరీక్ష ముగిసిన అనంతరం కేంద్రం నుండి బయటకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు.