ఆరుకు చేరిన రామంతాపూర్ ఘటన మృతుల సంఖ్య

HYD: రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ షాక్‌తో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేంద్ర రెడ్డి(39)లు స్పాట్ లోనే చనిపోగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు మరణించాడు. మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.