టీడీపీలో చేరిన 30 వైసీపీ కుటుంబాలు
NLR: కందుకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు మురారిశెట్టి శ్రీకాంత్, తన అనుచరులు 30 మందితో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమక్షంలో టీడీపీ పార్టీలో బుధవారం చేరారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలబడేలా నిర్ణయాలు తీసుకుంటుందని, జీఎస్టీ రేట్లు తగ్గించడం వారికి గొప్ప ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు.