VIDEO: కానూరుకు చేరుకున్న మాజీ సీఎం జగన్
కృష్ణా: మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పెనమలూరు మండలం కానూరుకు చేరుకున్నారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో పంట నష్టాన్ని జగన్ పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు. జగన్ వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.