'రేపటి నుంచి 22 వరకు రేషన్ బియ్యం పంపిణీ'
KMM: ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.