మున్సిపాలిటీ అభ్యర్థులకు మాజీ మంత్రి మార్గనిర్దేశనం
MBNR: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూత్పూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను మార్గనిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగాల్సిన విధానాలపై అభ్యర్థులకు స్పష్టమైన సూచనలు చేశారు.