నేడు కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల

KDP: జిల్లాలో సాగునీటిని అందించే ప్రధాన కాలువైన కడప - కర్నూలు కాలువకు రాజోలి ఆనకట్ట నుంచి సోమవారం సాగునీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రాజోలి ఆనకట్ట వద్ద నీటిని విడుదల చేస్తారని చెప్పారు. రైతులు పంటల సాగుకు సిద్ధం చేసుకోవచ్చని ఆయన సూచించారు.