జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా వాసి

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా వాసి

SRPT: కోదాడ మండలం భీక్యతండాకు చెందిన జీ. వెంకటేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 23 వరకు గుజరాత్‌లో జరిగే 27వ జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరపున 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ విభాగాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలలో స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌ను సర్పంచ్ ఝాన్సీ, గ్రామస్తులు అభినందించారు.