ఉరి వేసుకుని వ్యక్తి మృతి

SRCL: ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బివై నగర్‌కు చెందిన నక్క శ్రీనివాస్ నేడు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ పవర్ లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.