జిల్లాలో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం
కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద పట్టపగలు చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు సరుడు దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ సమయంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.