72 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష: SP

VZM: స్థానిక మహిళా PSలో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పట్టణానికి చెందిన కింతాడ అంజిబాబు అనే 72 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. మేడపై ఆడుకుంటున్న ఆరేళ్ల మైనరు బాలికను లైంగికంగా వేధించినట్లు బాలిక తల్లి ఫిర్యాదుతో ధర్యాప్తు చేశామన్నారు.