20 రోజుల్లో యాదగిరిగుట్టకు భారీ ఆదాయం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 20 రోజుల హుండీలను సోమవారం ఆలయాధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ ఆదాయ వివరాలను ఈఓ బావని ప్రసాద్ వెల్లడించారు. మొత్తం నగదు 1,52,01,420 రూపాయలు రాగా మిశ్రమ బంగారం 54 గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల ఏడు వందల గ్రాములు వచ్చినట్టు ఆయన తెలిపారు.