రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

ATP: గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని NH-44పై సోమవారం రాత్రి బైకు అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఊబిచర్ల గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన అతనిని 108 వాహన సిబ్బంది చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.