VIDEO: పామర్రులో ఎరువుల పంపిణీపై సమీక్ష

కృష్ణా: రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం సమీక్షించారు. పామర్రు టౌన్‌లోని "మన గ్రోమోర్" ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరిపల్లి గణేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.