రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన MRO

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన MRO

PPM: వీరఘట్టం MRO SS.కామేశ్వరరావు శనివారం రాత్రి మండలంలోని పలు రైస్‌ మిల్లులను తమ సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు చేశారు. రైతుల నుంచి అదనంగా ధాన్యం తూకం వేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మిల్లర్లను హెచ్చరించారు. ట్రక్కు సీట్లు లేకుండా ధాన్యం తీసుకువచ్చే వ్యాన్లను అన్‌లోడ్‌ చేయవద్దని సూచించారు.