ప్రేమ పేరుతో వల.. యువకుడు అరెస్ట్

ప్రేమ పేరుతో వల.. యువకుడు అరెస్ట్

GNTR: ప్రేమ పేరుతో యువతులకు వల వేస్తున్న వట్టిచెరుకూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా సంపన్న యువతులకు దగ్గరై.. వారి ఏకాంత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం లాగాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలిక నుంచి రూ.20 లక్షలు కాజేశాడు.