విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: తాడిపత్రి మండలంలో ఇంటర్ విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఇందు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఫెయిల్ అవుతాననే ఉద్దేశంతో ఫలితాలు వచ్చే రోజు ఉదయమే పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది.