కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు
విశాఖ: వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్‌లలో వేగవంతమైన చర్యలే ఇందుకు కారణమని తెలిపింది.