OUలో హోలీ వేడుకలు.. పాల్గొన్న బీజేపీ చీఫ్
HYD: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.