క్వారీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

SKLM: మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో శుక్రవారం రాత్రి ఓ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టెక్కలి మండలం పోలవరానికి చెందిన రామారావు(40), అప్పన్న(35)తో పాటు చెన్నైకి చెందిన పుంగవేను ఆరుగామం(45) చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.