'యాదగిరిగుట్ట అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం'

యాదాద్రి: యాదగిరిగుట్ట అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని పాత గుట్ట రహదారిలో రూ.3 కోట్ల నిధులతో 2 కిలోమీటర్లు 500 మీటర్ల పొడవు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాత గుట్ట రోడ్డు పదేళ్ల నాటి కల ఈరోజుతో నెరవేరుతుందని అన్నారు.